27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : పగలు రెక్కీ నిర్వహించి రాత్రి చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ముఠాకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జులై 25న భిక్కూర్ మండలం అంతంపల్లి గ్రామ శివారులో గల రెడిమిక్స్ కంపెనీలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వాచ్ మెన్ లను బెదిరించి మొబైల్, 11వేల విలువ చేసే ఐరన్ రాడ్లను అపహరించారు. 27న రాజంపేట మండలం తలమడ్ల శివారులో గల జెన్ అడ్సోర్పిటేషన్ కంపెనీలో చొరబడి 15లక్షల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ రెండు కేసుల్లో పోలీసులు బ్రుందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద ఒకరు, కామారెడ్డిలో నలుగురు, హైదరాబాద్ లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో దొంగిలించిన సొత్తును హైదరాబాద్ ముషీర్ బాగ్ లో విక్రయిస్తారని తేలింది. గతంలో వీరిపై ఆరు కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తానే అలీ, బిర్దేష్ అలీ, సల్మాన్, మహమ్మద్ సమీర్, చాంద్ బాబు(మైనర్) లు ముఠాగా ఏర్పడి కామారెడ్డి పట్టణంలోని ఇందిరా నగర్ కాలనీ, ఆదర్శ నగర్ కాలనీల్లో నివాసం ఉంటున్నారు. వీరు చోరీ చేసిన వస్తువులను ముషీర్ బాగ్ చేర్చడానికి ఆ ప్రాంతానికి చెందిన హాసన్ ఖాన్ అనే వ్యక్తి వాహనాన్ని సమకూరుస్తాడు. ఆ వాహనంలో ముషీర్ తీసుకెళ్లిన వస్తువులను పదినిమిషాల్లో పార్టులుగా విడదీసి కంటికి కనిపించకుండా ఇతర చోటికి తరలిస్తారు. వీరిపై మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక నాలుగు కేసులు ఉన్నాయి. వీరి వద్ద నుంచి మొబైల్ ఫోన్, ఒక అట్ఫీ కండెన్సర్, ఒక ఎస్పీడీయూ, 20లీటర్ల ట్యాంకులు 3,  రెండు రాడ్లు, ఒక బెల్ట్ గార్డ్, ఒక ఎఫ్ఎఫ్ఈ, ఒక తర్మసిఫాన్ పాట్, ఒక పైప్ లైన్, 390మీటర్ల సోలార్ ప్లాంట్ కాపర్ వైరు, 15వేల విలువ చేసే సెంట్రింగ్ బాక్సులు, 2.25, 7.5, 2 హెచ్పీ మోటార్లు, ఒక బైకు, టాటా ఏస్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీసీఎస్ పోలీసులు పాల్గొన్నారు.

More articles

Latest article