అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
కామారెడ్డి, బతుకమ్మ : పగలు రెక్కీ నిర్వహించి రాత్రి చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ముఠాకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జులై 25న భిక్కూర్ మండలం అంతంపల్లి గ్రామ శివారులో గల రెడిమిక్స్ కంపెనీలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వాచ్ మెన్ లను బెదిరించి మొబైల్, 11వేల విలువ చేసే ఐరన్ రాడ్లను అపహరించారు. 27న రాజంపేట మండలం తలమడ్ల...