29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జిజి కళాశాలను సందర్శించిన టిజిసిటిఏ రాష్ట్రకార్యదర్శి డా.బ్రిజేష్ 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలను  శనివారం “తెలంగాణ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్” కార్యదర్శి డా. బ్రిజేష్  జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాలలు మరియు అధ్యాపకుల క్షేత్ర స్థాయి సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్ర అధ్యాపకుల సమస్యలకు అధికారుల నుండి, ప్రభుత్వం నుండి జరుగుతున్న కృషిని తెలియజేశారు. బదిలీలు, కెరీర్ అడ్వాన్స్ స్కీమ్, వంటి  తదితర అంశాల పై విశేషమైన కృషి చేసిన  కార్యదర్శి డా. బ్రిజేష్ ను అధ్యాపకులు, కళాశాల ప్రిన్సిపాల్  డా.పి. రామ్ మోహన్ రెడ్డి, గొప్పగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డా. దండు స్వామి, రంగరత్నం, భరత్ రాజ్, డా.ముత్తెన్న, డా.రాజేశ్, డా. చంద్రశేఖర్, ఎన్సిసి. అధికారి లెఫ్టినెంట్ డా. రామస్వామి, ఏ.ఓ. రామ్ కిషన్, ఉదయ్ భాస్కర్ తదితర అధ్యాపక ఉద్యోగులు పాల్గొన్నారు.

More articles

Latest article