25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వేగవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రెవెన్యూ సదస్సులో భాగంగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వేగవంతం చేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తహసిల్దార్ కు ఆదేశించారు. శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఆకస్మికంగా  సందర్శించారు. రెవెన్యూ సదస్సులు, దరఖాస్తుల క్లియరెన్స్ ల స్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న రెవెన్యూ దరఖాస్తుల ప్రాసెసింగ్ ను వేగవంతం చేయాలన్నారు. నిర్ణీత గడువులోపు వాటిని పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ తహశీల్దార్ తారాబాయి, డిప్యుటీ తహసిల్దార్ సురేందర్ నాయక్ పాల్గొన్నారు.

More articles

Latest article