25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ బోధన్ నియోజకవర్గం అధ్యక్షులుగా చంటీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : తెలంగాణ బీసీ విద్యార్ధి సంఘం బోధన్ నియోజకవర్గం అధ్యక్షులు గా నవీపేట్ కు చెందిన చంటీ ని నియమిస్తున్నట్లు బీసీ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షులు సిరివెసు సంతోష్ కురుమ తెలియజేశారు. ఈ సందర్బంగా శనివారం నాడు బోధన్ పట్టణంలో నియామక పత్రం అందజేయడం జరిగింది. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు చంటీ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నన్ను ఎన్నుకున్న బీసీ సంఘం జిల్లా నాయకులకు ధన్యవాదములు అని, విద్యార్థుల సమస్యలపై నిరంతరo నా వంతుగా పోరాటం చేస్తానని తెలిపారు. నియామక పత్రం అందజేసిన వారిలో బీసీ నేతలు రవిశంకర్ గౌడ్, మహమ్మద్, కోర్బ శ్రీకాంత్, రమణ, సాయిలు తదితరులు ఉన్నారు.

More articles

Latest article