27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

 బోధన్, బతుకమ్మ  :

బోధన్ మండలంలోని ఆచన్ పల్లి ప్రధాన కూడలిలో బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.  శనివారం కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున హాజరై, కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుతూ హర్షాతిరేకాల మద్య వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా  నాయకులు గంగా శంకర్, నాగేశ్వరరావు లు మాట్లాడుతూ…జన హృదయ నేతగా, ప్రజల సేవకే అంకితమైన  సుదర్శన్ రెడ్డి  అయురారోగ్యలతో కలకలం సేవ చేయాలని అకాంక్షించారు.  మంత్రిగా నిజామాబాద్ జిల్లాతో పాటు బోధన్ నియోజకవర్గం అభివృద్ధి చేశారు మరోసారి అవకాశం వస్తే అన్ని రంగాల్లో  డెవలప్ చేసి ఎన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని కోరుతూ దేవుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, సాయిలు, విజయ్, సురేందర్ గౌడ్, అభిలాష్, చందు, కొండారెడ్డి, ఇంద్రకరణ్, శ్రీనివాస్ రెడ్డి, పాల శ్రీకాంత్, సుందర్ తదితరులు పాల్గొన్నారు.

Bodhan MLA Sudarshan Reddy's birthday celebrated in grand style

More articles

Latest article