రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గల యోగేశ్వర ఫెర్టిలైజర్, నందిని ఏజెన్సీ, ఓం సాయి ట్రేడర్, న్యూ రైతు డిపో ఎరువుల దుకాణాలను శుక్రవారం వ్యవసాయ అధికారి సాయికృష్ణతో కలిసి ఎస్సై సాయన్న తనిఖీ చేశారు. దుకాణంలోని స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్ లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ.. రైతులకు కాలం చెల్లిన ఎరువుల మందులను విక్రాయించరాదన్నారు. ఎరువులు కొనుగోలు పై ఖచ్చితంగా బిల్లు ఇవ్వాలని లేని యడల ఇన్సెక్టీసైడ్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకో బడుతాయన్నారు.
