30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఎమ్మెల్యే మదన్ మోహన్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ జన్మదినం సందర్భంగా పట్టణంలోని నీలకంఠేశ్వరాలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి అభివృద్ధిలో ఎనలేని కృషి చేస్తున్నారని, భవిష్యత్‌లో ఆయనకు మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని కోరుతూ, జిల్లా కేంద్రంతో పోటీ పడేలా ఎల్లారెడ్డిని అభివృద్ధి ప్రదాతగా తీర్చిదిద్దాలని నాయకులు అభిలాషించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మాజీ ఎంపీపీ నునుగొండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు మంచిర్యాల విద్యాసాగర్, మాజీ కౌన్సిలర్ నీలకంఠం, అల్లం శ్రీనివాస్, సాయిబాబా, నాగం గోపీకృష్ణ, అశోక్ అప్ప, శుభాషప్ప, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Special prayers on the occasion of MLA Madan Mohan's birthday

More articles

Latest article