నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఆదేశాల ప్రకారం నిజామాబాద్ ,కామారెడ్డి ప్రభుత్వ ఆఫీసు లలో ప్రజలు తిరిగే కూడల్లో టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి సంబందించిన స్టిక్కర్ లను అతికించి ప్రచారం చేయడం జరిగిందని నిజామబాద్ రెంజ్ డిఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ఎవరికైన ప్రభుత్వ కార్యాలయాలలో ఏదైనా పని నిమిత్తం వెళ్ళిన, ఎవరైనా అధికారి కానీ అతనికి సంబందించిన వారు గాని మీ యొక్క పని పూర్తి చేయించడం కోసం మిమ్ముల్ని లంచం డబ్బులు డిమాండ్ చేసినచో మీరు నేరుగా 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. లేదా డిఎస్పీ కిగాని ఫిర్యాది చేసి అవినీతి నిరోధానికి మీ వంతు తోడ్పాటు అందించాలని కోరారు.

