27.1 C
Hyderabad
Sunday, August 2, 2026

బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారా.. లేకుంటే రాజీనామా చేస్తారో కేంద్రమంత్రులు తేల్చుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • 42 శాతం బీసీ రిజర్వేషన్ పై వినతితో వినట్లే.. పోరాడాలి
  • బీజేపీ సామాజిక న్యాయానికి వ్యతిరేకి
  • ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టం తేవాలి
  • సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఒత్తిడి తేవాలి.. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో చట్టం చేసి బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారా.. లేకుంటే రాజీనామా చేస్తారా తేల్చుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నిజామాబాద్ జిల్లా సిపియం కార్యాలయంలో బుధవారం జాన్ వేస్లీ విలేఖరులతో మాట్లాడుతు…కేంద్రంలోని బీజేపీ సామాజిక న్యాయానికి వ్యతిరేకి.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని ఆమోదించకుండా గవర్నర్ సైతం కేంద్రానికి సిఫారసు చేశారు. కేంద్రాన్నివిన్నవిస్తున్నా వినిపించుకోవట్లేదు. వినతులతో పనులు కాదు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ లకోసం రాష్ట్ర ప్రభుత్వం  రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలను కలుపుకొని ఆందోళనలకు సిద్ధమైతేనే కేంద్రం దిగి వస్తందన్నారు. బీజేపీకి 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదని పేర్కోన్నారు.  కేంద్రంలోని బీజేపీ తీరుతో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నట్టు తెలిపారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులను పంటలకు మద్దతు ధర కల్పించకుండా రైతులను, కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికులను ఇలా అన్ని వర్గాల ప్రజలను పట్టించుకోవడం లేదని అన్నారు. మతాల మధ్య వైరం పెడుతూ మతోన్మాద వైఖరి అవలంభిస్తుందని విమర్శించారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి దాని స్థానంలో మనువాదం తీసుకురావాలని చూస్తుందని మనువాదంతో కులవ్యవస్థ, అసమానాతలు, దోపిడీ వ్యవస్థ పెరిగే అవకాశం ఉందని అన్నారు… రాష్ట్రానికి నిధులు ఎలాంటి పనులు తీసుకురావడం లేదని అన్నారు.రెండు నెలలు బస్తీబాట గ్రామాల్లో, బస్తీల్లో నెలకొన్న స్థానిక సమస్యలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బస్తీ బాటనిర్వహించనున్నట్టు జాన్వెస్లీ తెలిపారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు క్షేత్రస్థాయిలోపర్యటించి సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటే ప్రభుత్వానికి తగిన బుద్దిచెప్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.రమణ,  వెంకట్రాములు,  ప్రసాద్, నూర్జహాన్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు, డీవైఎఫ్ఎ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు.

More articles

Latest article