29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 20 మందికి జరిమానా

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 20మంది పై పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా సిరిసిల్ల సెకండ్ క్లాస్ కోర్ట్  న్యాయమూర్తి జయశ్రీ   మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జరిమానాలు విధించినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ కే. రాహుల్ రెడ్డి తెలిపారు. పోలీసులు వాహన తనిఖీలు చేసిన సమయంలో16 మంది ద్విచక్ర వాహనదారులు,1 ఆటో దారుడు, ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి  పోలీసులకు దొరికారనీ,వారి పై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు న్యాయమూర్తిజరిమానా విధించారనీ,వాహనాదారులు మద్యం సేవించి వాహనాలు నడిపినా,బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎస్సై కె . రాహుల్ రెడ్డి తెలిపారు.

More articles

Latest article