26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మౌళిక వసతుల కోసం ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ కు వినతి

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కిష్టంపల్లి లో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం పూర్తయినప్పటికి ఇంకా కొన్ని పనులు పెయింటింగ్, ఎలక్ట్రికల్, నీటి సౌకర్యం కోసం సంప్ నిర్మాణం, చుట్టూ ప్రహరీ గోడ, సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తే కిషన్ దాస్ పేట, కిష్టంపల్లి లో నివాసం ఉంటున్న అనేక కుటుంభాలకు హెల్త్ సబ్ సెంటర్ వినియోగంలోకి వచ్చి ఇక్కడి ప్రజలకు వైద్య సేవలు అందుతాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ సోమవారం జిల్లా కేంద్రం లో జరిగిన ప్రజావాణి లో వినతిపత్రం అందించగా జిల్లా వైద్యాధికారిణి రజిత ను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.అదే విధంగా గ్రామంలో మూడో వార్డులో తాగునీటి వసతి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మిషన్ భగీరథ నీరు కూడా సమృద్ధిగా రావడం లేదని దీంతో ఇక్కడ నివాసం ఉంటున్న వందకు పైగా కుటుంబాలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని 150 మీటర్ల మేర మురికి కాలువ నిర్మాణం చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి తీసుకెళ్లగా ఇట్టి సమస్య పరిష్కరించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆయన ఆదేశించారు. వెంటనే జిల్లా పంచాయతీ అధికారి ఎల్లారెడ్దిపేట ఎంపీఓ రాజు ను తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

More articles

Latest article