- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలు రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు అవసరమైన కోడిగుడ్ల సరఫరా చేసేందుకు నిబంధనలు ప్రకారం టెండర్ దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కోడి గుడ్ల ప్రోక్యూర్ మెంట్ పై నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ పాల్గొన్నారు. ఒక సంవత్సరం పాటు కోడిగుడ్ల సరఫరా టెండర్ ప్రక్రియ పై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు ( ఎస్సి,ఎస్టీ, బీసి, మైనారిటీ కేజీబీవీ….)మధ్యాహ్న భోజన పథకం మినహాయించి ఒక సంవత్సరం పాటు అవసరమైన కోడి గుడ్లు ప్రమాణాల ప్రకారం సరఫరా చేసేందుకు టెండర్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.కోడిగుడ్ల సరఫరా టెండర్ ను దాఖలు చేయాలంటే తెలంగాణలోని కోళ్ల ఫారం గల పౌల్ట్రీ రైతులు గత 3 సంవత్సరాల ఓనర్ షిప్ (2022-25) చూపించే టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుందని, లీజ్ కోళ్ల ఫారంకు అర్హత లేదని, ఆగ్ మార్క్ సర్టిఫికేషన్ ఉండాలని, ఒక కోళ్ల ఫారం 8 జిల్లాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, టెండర్ డాక్యుమెంట్ లో ఉన్న గుడ్లలో కనీసం 40 శాతం వరకు సొంతంగా కోళ్ల ఫారం నుంచి ఉత్పత్తి చేయాలని మిగిలినవి పౌల్ట్రీ రైతుల నుంచి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సర్టిఫికేషన్ తో టై అప్ చేసుకోవచ్చని అన్నారు. టెండర్ దాఖలు చేసే పౌల్ట్రీ రైతులకు గత మూడు సంవత్సరాలలో ఒక సంవత్సరంలో ఐదు కోట్ల రూపాయల విలువగల గుడ్లు సరఫరా చేసిన అనుభవం ఉండాలని, వార్షిక టర్న్ ఓవర్ 4 కోట్ల పైగా ఉండాలని, అవసరమైన లైసెన్సులు ఉండాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంవత్సరం పాటు అవసరమైన కోటి 34 లక్షల 6 వేల 730 కోడిగుడ్లు సుమారుగా అవసరం ఉన్నాయని, ప్రతి కోడి గుడ్డుకు 7 రూపాయల చొప్పున నెక్ రేట్స్ ప్రకారం ప్రభుత్వం చెల్లింపు చేస్తుందని, వీటీ పంపిణీకి ఆసక్తి, అర్హత గల వారు నాన్ రిఫండబుల్ డీడీ 10 వేల రూపాయలు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రాజన్న సిరిసిల్ల పేరు మీద డిడి తీసి టెండర్ దాఖలు చేయాలని, టెండర్ దక్కిన వారు 1% ఈ.ఎం.డీ క్రింద 9 లక్షల 38 వేల 471 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. కోడిగుడ్ల సరఫరా టెండర్ బిడ్ డాక్యుమెంట్ జూలై 29 లోపు డౌన్ లోడ్ చేసుకోని ఆగస్టు 7,2025 సాయంత్రం 4 గంటల లోపు ఆన్ లైన్ లో, ఆగస్టు 8,2205 సాయంత్రం 4 గంటల లోపు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ నందు టెండర్ డాక్యుమెంట్లు హార్డ్ కాపీలు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.
కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఆగస్టు 12న టెక్నికల్ బెడ్, 13న ఫైనల్ బెడ్ ఓపెనింగ్ ఉంటుందని పేర్కొన్నారు.టెండర్లను ఆన్ లైన్ లో ఈ – టెండరింగ్ ప్లాట్ ఫామ్ లో మాత్రమే నమోదు చేయాలని, ఆఫ్ లైన్ విధానంలో అనుమతించడం లేదని అన్నారు. టెండర్ దాఖలు సమయంలో తప్పుడు సమాచారం అందిస్తే సదరు టెండర్ ను ఏ క్షణంలోనైనా రద్దు చేయడమే కాకుండా బిడ్డను బ్లాక్ లిస్ట్ చేయడం జరుగుతుందని, క్రిమినల్ ప్రొసీక్యూషన్ కూడా చేస్తామని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఆయా విద్యాలయాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
