27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

  • యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్

 

మాక్లూర్, బతుకమ్మ : ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) ఆధ్వర్యంలో ఈనెల 31న జరిగే ఛలో కలెక్టరేట్ కరపత్రాలను మాక్లూరు కేజీబీవీ వద్ద ఆవిష్కరించడం జరిగింది.  ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ఎం.సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేజీబీవీల్లో నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. పని భారం విపరీతంగా పెరిగిందన్నారు. రిటైర్ అయిన కార్మికులకు గ్రాట్యూటీ చెల్లింపులు లేవన్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటే, సిబ్బంది సంఖ్య తగ్గుతుంధని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీలుగా అప్ గ్రేడ్ ఐన, కొత్తగా మంజూరైన కేజీబీవీలకు తగిన సిబ్బందిని నియమించలేదన్నారు. డ్యూటీ చార్ట్, వీక్లీ ఆఫ్ సక్రమంగా అమలు కావడం లేదన్నారు. అధికారంలోకి రాగానే పర్మినెంట్ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. వీరి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 31న టియుసిఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ధర్నాను జయప్రదం చేయాలని కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బందికి పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బంది మోతి, రమ, శారద, సువర్ణ, శారదమ్మ, విజయమ్మ, ఆండాలు, చంద్రకళ, విమల, నిర్మల, రజిత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article