26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట,గంభీరావుపేట, వీర్నపల్లి మండలాలలో ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరకు చేర్చాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య ఆదివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో రకాలైన పథకాలను అమలు చేస్తూ ఉంటే కార్యకర్తలు వాటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మనదేనని అన్నారు.మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ కింద మహిళా సంఘాలకు డబ్బులను ప్రభుత్వం మహిళా సంఘాల అకౌంట్లకు వేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా సంఘ సభ్యురాలు మరణిస్తే 2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులను కూడా అందిస్తున్నారని అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాలకు ఒక్కొక్క బస్సు చొప్పున అందించడానికి ప్రణాళికకు ఆమోదం జరిగిందన్నారు.త్వరలోనే ఈ బస్సులను మండలానికి ఒక్కటి చొప్పున మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతులకు రుణమాఫీ తో పాటు రైతు భరోసాని కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు.ఎక్కడ ఎరువుల కొరత లేకుండా మహిళా సంఘాల ద్వారా యూరియా సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.రాబోయే కాలంలో సూపర్ మార్కెట్లు పెట్రోల్ బంకులు,  రైస్ మిల్లులను మహిళా సంఘాలకు అప్పగించి వారిని  కోటీశ్వరులను చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యా విధానంలో సమూలమైన మార్పులు చేస్తూ గురుకులాలను పెంచి విద్యార్థులను బాగా చదివించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఉపాధ్యాయులకు కూడా ఒకటో తేదీన జీతాలు ఇస్తూ ప్రమోషన్లలో జాప్యం లేకుండా వెంటవెంటనే ప్రమోషన్లను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు  విదేశీ విద్యా  పథకం కింద విదేశాల్లో చదువుకోవడానికి ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయల సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు పథకాలలో ఇప్పటికే ఐదు పథకాలను అమలు లోకి తెచ్చి ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు.సన్న బియ్యం పంపిణీ రేషన్ కార్డులు అందించడం ఒక బృహత్తర కార్యక్రమం అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ పథకాలను పేద ప్రజలందరికి చేర్చడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు.

More articles

Latest article