29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గిరిజన భూముల జోలికొస్తే సహించేది లేదు

Must read

📰 Generate e-Paper Clip

  • పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
  • లంబాడి హక్కుల పోరాట సమితి  జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బెల్లయ్య నాయక్

 

గాంధారి, బతుకమ్మ : గిరిజన భూముల జోలికొస్తే సహించేది లేదని ట్రైకార్ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి  జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బేల్లయ్య నాయక్ హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా  గాంధారి మండల కేంద్రంలో మారుతి ఫంకన్ హాల్ లో లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) ఆధ్వర్యంలో జరిగిన సభలో ట్రైకార్  చైర్మెన్, జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు  డా. తేజావత్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర  ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు మూడవత్ రాంబల్ నాయక్ మాట్లాడారు. లంబాడి హక్కుల పోరాట సమితి 1997 జూలై 1న ఆవిర్భవించిందన్నారు. ఒక లక్ష్యం సిద్ధాంతం కోసం మా తండాలో మా రాజ్యం గ్రామాలకు దూరంగా ఉన్న తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మేమెంత మందిమో మాకంతా వాటా  కావాలనే నినాదంతో ఆవిర్భవించిందని తెలిపారు.  లంబాడి (నంగారా భేరి) లంబాడి హక్కుల పోరాట సమితి సంఘం తమ పోరాట ఫలితంగా గత కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 3000 వేలకు పైగా నూతన గిరిజన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకొని మా తండాలో మా రాజ్యం లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు.  మేమెత మందిమో  మాకంత  వాటా కావాలని, జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్లను పెంచాలని  ఆరు శాతంగా ఉన్న గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి గత ప్రభుత్వంలో పెంచేల చేసుకున్నామని తెలిపారు. ఇది లంబాడి హక్కుల పోరాట సమితి విజయం అని అన్నారు. అదేవిధంగా లంబాడీల భాష గోర్ బోలి ని భారత రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్లో చేర్చడం కోసం లంబాడి హక్కుల పోరాట సమితి పోరాటంతో ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి  కేంద్ర ప్రభుత్వానికి పంపే విధంగా  చేసుకున్నామన్నారు.  లంబాడి హక్కుల పోరాట సమితి పోరాటం చేసి  ఎన్నో సమస్యలను సాధించుకున్నామని తెలిపారు.  కామారెడ్డి జిల్లాలో ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇవ్వాలని చాలా భూములకు రైతులు సాగు చేస్తున్న రైతుల భూములనుపట్టలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  లేని ఎడల పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు.  నిరంతరంగా లంబాడి జాతి ప్రజల పక్షాన నిలబడి  పోరాటం చేయడంలో ముందు వరుసలో  ఉంటదని  విద్యార్థుల, ఉద్యోగుల, రైతుల , మహిళల పక్షాన లంబాడి జాతికి ఏ అన్యాయం జరిగినా లంబాడి హక్కుల పోరాట సమితి చూస్తూ ఊరుకోదని అందుకోసమే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లంబాడీలను ఐక్యం చేస్తూ   భవిష్యత్తులో లంబాడీల హక్కుల సాధన కోసం పోరాటంలో లంబాడి హక్కుల పోరాట సమితి కార్యకర్తలు ముందుండాలని అన్నారు. లంబాడీల పై జరుగుతున్న దాడులను, కుట్రలను ఛేదించడం కోసం తండాల అభివృద్ధి లక్ష్యంగా రాబోయే రోజుల్లో మన తండాలను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. మన భాష గోర్ బోలిని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో  చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వంపై జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.  మన తండాలలో లంబాడీల తీజ్ పండుగ, సీట్ల పండుగ, సేవాలాల్ మహారాజ్ జయంతి లాంటి బంజారా  సంస్కృతి, సాంప్రదాయాలు రక్షించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కోటి అన్నయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ నాయక్, రాణా ప్రతాప్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వినోద్ నాయక్ రాష్ట్ర కార్యదర్శి, నునావత్ గణేష్ నాయక్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, కాట్రావత్ బద్రు నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామారెడ్డి జిల్లా, మోతిలాల్ నాయక్ లంబాడి యోజన విభాగం అధ్యక్షులు పాల్గొన్నారు.

Encroachment on tribal lands will not be tolerated

More articles

Latest article