- కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కేటీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, వెంటనే రమేష్ కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలని హెచ్చరించిన భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నాయకులతో కలిసి సీఎం రమేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ ని ఏమైనా అంటే ఊరుకోమని, మీ పార్టీ ఎప్పుడూ మా తెలంగాణాకు వ్యతిరేకమని తెలంగాణకు నష్టం చేయాలని చూస్తారనీ అన్నారు. మీరూ కేటీఆర్ ని ఏమైనా అంటే మీకు రాజకీయ భవిష్యత్ ఉండదని హెచ్చరించారు.తక్షణమే సీఎం రమేష్ మీ పార్టీ తరుపున కేటీఆర్ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.కేటీఆర్ పై మాట్లాడే అర్హత మీకు లేదన్నారు. మీరు మీ పార్టీ తెలంగాణ కు ద్రోహుల పార్టీ అని ఇక్కడి ప్రజలకు తెలుసనని,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ సాధించిన మా తెలంగాణ ప్రాంతం అని గుర్తు చేశారు.మీ తెలంగాణలో పాగా వెయ్యాలని చూస్తున్నరనీ మీరు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన మాట్లాడితే కేటీఆర్ అభిమానులుగా నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టి శ్రీనివాస్, ముద్దం అనిల్ గౌడ్, కోడం వెంకటేశం, ఎస్.కె అప్రోచ్, శ్రీనివాస్,హరీష్, రాము, పవన్ తదితరులు పాల్గొన్నారు.

