- పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కొనేళ్లుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులు పెట్టాలని పి డి ఎస్ యూ విద్యార్థి సంఘం అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిందని, ప్రజా ప్రతినిధులను,అధికారులను ప్రశ్నించి నిలదీసిందని దీని ఫలితంగానే తెలంగాణ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కోర్సులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్ తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలో తే యూ పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు పెడుతున్న దృశ్య గర్ల్స్ కి హాస్టల్స్ సరిపోవడం కష్టమవుతుందని తొందరగా నూతన గర్ల్స్ భవనాన్ని నిర్మించాలని, సరిపోయే ఫ్యాకల్టీని భర్తీ చేయాలని, భవిష్యత్తులో మరిన్ని ఇంజనీరింగ్ కోర్సులు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఉపాధి కోర్సులు తీసుకురావడానికి యూనివర్సిటీ అధికారులు ప్రయత్నం చేయాలని అదేవిధంగా కొత్త భవనాలు, ఆడిటోరియం , స్టేడియం, నిర్మించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం నిరంతరం పిడిఎస్ యూ విద్యా సంఘం పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తే.యు పి డి ఎస్ యూ నాయకులు రాకేష్, కే.గౌతం రాజ్, రాజేందర్,రాము తదితదిరులు పాల్గొన్నారు.
