24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

సీఎం రేవంత్ రెడ్డి పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు

వెబ్ న్యూస్, బతుకమ్మ:  రాజేంద్రనగర్ పోలీస్ స్టేష న్ లో  బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి పై కౌశిక్ రెడ్డి అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని రాజేంద్రనగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు రాజేంద్రనగర్ పోలీసులు చెప్పారు

కౌశిక్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ శ్రేణులు

సీఎం రేవంత్ రెడ్డి పై శుక్రవారం కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రదూమారం రేపిన విషయం తెలిసిందే. కొండాపూర్ లోని కొల్లా లగ్జరీస్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం ఉంటుండగా… ఆయన ఇంటిపై ఏ క్షణమైనా దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో భారీగా పోలీసులను మోహరించారు. కౌశిక్ రెడ్డి నివాసానికి ఆయన మద్దతుదారులు బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు దాడి చేస్తే అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ కార్యకర్తలు పేర్కొంటున్నారు.

More articles

Latest article