29 C
Hyderabad
Monday, August 3, 2026

జిల్లా రెడ్ క్రాస్ కు ప్రశంసా పత్రం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : క్షయ వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచినందుకు జిల్లా రెడ్ క్రాస్ కు ప్రశంసా పత్రం తో పాటు జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులును సన్మానించారు.  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం నుండి ప్రశంసా పత్రం ను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సభ్యులు టీవీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి టీబీ వ్యాధిగ్రస్తులకు అండగా నిలవాలని సూచించారు. ఇటీవల జిల్లాలో సమీక్ష లో రాష్ట్ర గవర్నర్ టి బి ముక్తి భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టాలని అన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, డాక్టర్ వి మనోహర్ రెడ్డి రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ పి ఎం టి బి ముక్తి భారత్, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి రవీందర్  కార్యదర్శి అమర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Certificate of appreciation to the District Red Cross

More articles

Latest article