- బ్రిడ్జి పైనుంచి వాగులో పడ్డ ట్రాక్టర్
- వాహనాల దారి మళ్లింపు
ఇందల్వాయి, బతుకమ్మ : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లింగాపూర్ వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. లింగాపూర్ వాగు పై నిర్మిస్తున్న బ్రిడ్జీ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. బ్రిడ్జీ నిర్మాణం కోసం చేపట్టిన తాత్కాలిక బ్రిడ్జీ మీదుగా వరద పొంగిపొర్లుతుంది. తాత్కాలిక వంతెన మీదుగా అవతలి వైపు దాటుతున్న ట్రాక్టర్ గురువారం ప్రమాదవశాత్తు వాగులో పడిపోయింది. ఇందల్వాయి మండల కేంద్రంలోని లింగాపూర్ నూతన వాగు వంతెన నిర్మిస్తూ ఉండడంతో ఇప్పటికి పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రాక్టర్ వాగులో పడిన విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సందీప్ సంఘటన స్థలానికి చేరుకొని వాహనదారులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇందల్వాయి మండలంలో లింగాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడం వలన అట్టి వాగుపై బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నందున ధర్పల్లి వైపు వెళ్లే వాహనాలను తిరుమనపల్లి గ్రామం నుంచి రాంపూర్ కు వయా మల్లాపూర్ లోలం, ఎల్లారెడ్డిపల్లి కు మరలించడం జరిగిందన్నారు. ధర్పల్లి వైపు వెళ్లి వచ్చేవారు పై తెలిపిన రూట్ లో రావాలన్నారు. హైదరాబాద్ నుండి వచ్చేవారు వయా గన్నారం, నల్లవెల్లి, గౌరారం, లింగాపూర్ మీదుగా ధర్పల్లి రావాలని ఎస్సై సందీప్ తెలిపారు. రాకపోకలను నిలుపువేస్తూ బారీ కేడ్ లను ఏర్పాటు చేశారు. గడిచిన ఏడాది కుడా తాత్కాలిక బ్రిడ్జీ కొట్టుకుపోయినప్పటికి ఏడాది గడిచిన పనులు మాత్రం ఒక్క అడుగు ముందుకు పడటం లేదు.

