24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇందిరా మహిళా శక్తి సంబరాలను సద్వినియోగం చేసుకోండి

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఏంసీ చైర్మన్ పాలెం నర్సయ్య

 

భీమ్ గల్, బతుకమ్మ :  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరా మహిళా శక్తి సంబరాలను మహిళామణులు సద్వినియోగం చేసుకోవాలని కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య అన్నారు. గురువారం భీమ్ గల్ మండలంలోని పురణిపేట్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను ఆయన ప్రారంభించిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు రూ. 1.50 కోటి యాభై లక్షలు శ్రీనిధి రుణాలు, రూ.52 లక్షల రుణాలు వడ్డీ రాయితీ,   రూ.8  లక్షల యాభై వెయ్యిలు మంజూరు కావడం జరిగిందని, వాటిని ఈ రోజు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.మహిళా సంఘ సభ్యులకు ప్రభుత్వం కల్పిస్తున్న లోన్ బీమా, ప్రమాద బీమా, ఉచిత బస్సు సౌకర్యం,  మహిళా శక్తి క్యాంటీన్లు,  పెట్రోల్ బంకులు, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రభుత్వ పథకాలను ప్రతి గ్రామంలో మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలని, తద్వారా మహిళలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేటట్లు కార్యక్రమం లను చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు మాజీ యం.పిపి కన్నే సురేందర్ , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదిరే స్వామి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంట రమేశ్,  ఎస్ సి సెల్ అధ్యక్షుడు అనంతరావు , బీమ్ గల్ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య , కాంగ్రెస్ నాయకులు అను సాగర్ , శివ క్రాంతి, దైడి సురేష్, పల్లె శేఖర్ , రాజు , ఐకేపీ అధికారులు కుంట శ్రీనివాస్ , పురస్తు నరేష్, ఏడేల్లి రవి, గ్రామస్థాయి అధికారి కృష్ణాసాగర్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article