హైదరాబాద్, బతుకమ్మ : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ నియోజవర్గం లో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులను అదేశించిన ప్రశాంత్ రెడ్డి గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కేటీఆర్ బర్త్ డే వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయించి కేటీఆర్ కు తినిపించారు. కేటీయర్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కి కేక్ ను తినిపించి,ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకొన్నారు. ఆయన కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలను తెలిపి, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకొన్నారు.

