27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పాడె మోసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త దుడ్డు లింగన్న గత కొన్ని రోజులుగా  అనారోగ్యం తో  బాధపడుతూ  ఆదివారం మృతి చెందారు. అంతక్రియల్లో  రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి  పాల్గొని  పాడి మోశారు.  ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్  నాయకులు దుడ్డు లింగన్న గుపన్ పల్లి వాస్తవ్యులు.  గత కొన్ని రోజులుగా  క్యాన్సర్ వ్యాధితో పరడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.  రూరల్ ఎమ్మెల్యే  భూపతి రెడ్డి  అనుచరుడు గా ముద్ర వేసుకొన్నారు.  గతంలో ఎంపీటీసీ గా పోటీ చేసి ఓడిపోయారు. గత నిజామాబాదు నగర  కార్పొరేషన్  ఎన్నికల్లో  గుపన్ పల్లి  నుంచి  కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కి  నమ్మిన వ్వక్తి గా  తన ముద్ర వేసుకొన్నారు.

More articles

Latest article