బతుకమ్మ, ఏర్గట్ల: మండలంలోని తాళ్ళ రాంపూర్ గ్రామానికి చెందిన బక్కురి జనార్ధన్ అనే వ్యక్తి బ్రతుకుతెరువు కొరకు మస్కట్ దేశానికి వెళ్లడం జరిగింది. ఇతను మస్కట్ దేశం లో( శీన ) మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తుండగా వేగంగా అజాగ్రత్తగా వచ్చిన కారు ఢీ కొనడంతో జనార్ధన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు జనార్దన్ కుటుంబ సభ్యులు తెలిపారు. బలదియ కంపెనీ, ఎన్ఆర్ఐ ల సహకారం తో జనార్ధన్ మృత దేహం స్వగ్రామానికి రావడం జరుగుతుందని తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది. జనార్దన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తాళ్ల రాంపూర్ గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
