26.3 C
Hyderabad
Monday, August 3, 2026

క్రీడారంగంలో గెలుపు ఓటములు సహజం

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: క్రీడా రంగంలో గెలుపు ఓటములు సహజమని కబడి పోటీల ద్వారా మానసికంగా శారీరకంగా దృడంగా ఉంటారని  మెండోరా విద్యాధికారి శ్రీనివాస అన్నారు. కీర్తిశేషులు రెంజర్ల చందు స్మారక అండర్ 16 కబడ్డీ టోర్నమెంట్ను శనివారం దండోరా మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ క్రీడలు భజరంగ్ దళ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. క్రీడాలలో గెలుపొందిన వారికి బహుమతులతో పాటు ప్రైజ్ మని ఇవ్వడం జరిగింది. బాలుర కబడ్డీలో సిరికొండ జెడ్పిహెచ్ఎస్ మొదటి స్థానంలోనూ ఎంజేపి ఇందూర్ రెండవ స్థానంలోనూ జెడ్ పి హెచ్ ఎస్ పడగల్ మూడో స్థానంలోనూ నిలిచాయి. బాలికల కబడ్డీ జట్టులో టీఎస్ డబుల్ ఆర్ ఎస్ ఇందల్వాయి మొదటి స్థానంలోనూ, జెడ్ పి హెచ్ ఎస్ రాంపూర్ ద్వితీయ స్థానంలోనూ, ఎం జె పి బాల్కొండ తృతీయ స్థానంలోనూ నిలిచాయి. కార్యక్రమంలో నిజామాబాద్ కబడి అసోసియేషన్ కార్యదర్శి కే గంగాధర్ వేల్పూర్ సొసైటీ చైర్మన్ ముత్యంరెడ్డి గంగారెడ్డి ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్, బజరంగ్ దళ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article