బతుకమ్మ, పిట్లం: పిట్లం మండల కేంద్రంలో శనివారం నాడు ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణము ఎంతవరకు వచ్చిందని ఎంపీడీవో రఘు పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లలో ఎంపికైన లబ్ధిదారులు నిర్మాణం పనులు వేగవంతం చేయాలని వారికి సూచించారు. బేస్మిట్ లెవెల్ లో ఉన్న ఇండ్లకు ప్రతి సోమవారం నాడు బిల్లు మంజూరు అవుతుందని ఆయన తెలిపారు. గ్రామ కార్యదర్శి బలరాం ఇందిరమ్మ ఇండ్లను పనులను పరిశీలించి వాటి యొక్క డేటాను పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ బలరాం సిబ్బంది ఉన్నారు.
