29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఈ – సమాన్స్ నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈ – సమాన్స్ నిర్వహణపై పోలీస్ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లకు ” ఈ – సమాన్స్ ” శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి కేసులో సంబంధిత వ్యక్తులకు సమయానుగుణంగా ఈ – సమా న్స్ జారీ చేయాలన్నారు.  పారదర్శకత, వేగవంతమైన సేవలకై టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలన్నారు. సంబంధిత డిజిటల్ ప్లాట్‌ ఫామ్లను వాడడంలో శిక్షణ తీసుకుని , ప్రతి ఆదేశాన్ని రికార్డు చేయాలని సూచించారు. సంబంధిత అన్ని కోర్టుల నుండి సమన్సు జారీ చేసిన వాటిని అట్టి సమాన్స్ లను  పోలీస్ స్టేషన్లో వారు డౌన్లోడ్ చేసుకుని ఆ సమాన్స్ ను వాటిని త్వరితగతిన సర్వ్ చేయాలి  అని తెలిపారు. ఈ శిక్షణను సిబ్బంది సద్వినియోగపరుచుకొని శిక్షణ పూర్తి అయిన అనంతరము సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ లకు ఈ శిక్షణ గురించి క్లుప్తంగా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి , సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ సతీష్,  కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్యాం కుమార్,  నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని కోర్ డ్యూటీ ఆఫీసర్లు, ఐటి కోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Clear guidelines should be given on the handling of e-summons

More articles

Latest article