ఈ – సమాన్స్ నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈ - సమాన్స్ నిర్వహణపై పోలీస్ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లకు " ఈ - సమాన్స్ " శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి కేసులో సంబంధిత వ్యక్తులకు సమయానుగుణంగా ఈ - సమా న్స్ జారీ చేయాలన్నారు. ...