- కాస్ట్ ఎస్టిమేషన్ లేకుండానే పనులు
- అధికారులకు సమాచారం ఇవ్వకుండానే ఫీడర్ చేంజ్
- పై పెచ్చు పనులు ఎలా జరిగాయని లైన్ ఇన్స్ పెక్టర్ పై బూతుల పర్వం
- విద్యుత్ శాఖ అధికారి తీరు వివాదాస్పదం
నిజామాబాద్, బతుకమ్మ : బోధన్ సబ్ డివిజన్ లో వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు ఒక అసిస్టెంట్ ఇంజనీర్. రూద్రూర్ ఎడిఇ పరిధిలోకి వచ్చే చందూర్- మోస్రా ప్రాంతాల విద్యుత్ శాఖ అధికారి తీరుపై స్థానిక విద్యుత్ శాఖ సిబ్బంది మాస్ లీవ్ కు సిద్ధం కావడంతో ఈ వ్యవహరం వెలుగు లోకి వచ్చింది. ఇటీవల స్థానిక ఎఇ పరిధిలోని గ్రామస్థులు అధికారికి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధం కావడంతో బోదన్ ఎడిఇ ( రూద్రుర్ ఇంచార్జీ) వచ్చి వివాదాన్ని సద్ధుమణిగించారు. కాని సదరు అధికారి తీరు మార్చుకోకుండా ఏకంగా తన కింది స్థాయి లైన్ ఇన్స్ పెక్టర్ ను బూతులు తిట్టిన పంచాయతీ కులం వద్దకు, తరువాత యూనియన్ వద్దకు అటు నుంచి అధికారుల వద్దకు వెళ్లడంతో రెండు రోజుల క్రితం బోధన్ డిఇఇ ముక్తార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి గొడవలను సద్ధుమణిగించుకోవాలని, ఎఇపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. అధికారులకు ఫిర్యాదు చేస్తే శాఖా పరమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలని సూచనలతో సిబ్బంది రగిలిపోతున్నారు.
ఇటీవల విద్యుత్ శాఖ అధికారికి అక్కడ కింది స్థాయి సిబ్బందికి వివాదానికి కారణం ఏమిటంటే.. చందూర్- మోస్రా ఏరియాలోని గోవూర్ సబ్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్ ఫార్మర్ ( ఎస్ఎస్ నెంబర్ 234) 25 కేవిఏ ఎన్ఎస్ఎఫ్ ఫీడర్ మీద ఉన్నది. ఆక్కడ ఉన్న నాలుగు పోళ్లకు సంబంధించిన కండక్టర్ వైర్ తీసేశారు. అదే ట్రాన్స్ ఫార్మర్ వేరే 11 కేవి అమ్ధాపూర్ పీడర్ పైన బిగించారు. తీసి వేసిన కండక్టర్ డిపార్ట్ మెంట్ కు అప్పగించలేదు. ఒక పోల్ ద్వారా ఎల్ టి లైన్ లాగిన అధికారి మిగితా కండక్టర్ వైర్ విషయం గాని, ఫీడర్ చేంజ్ గాని, డిటిఆర్ మార్చినట్లు దానిని ఉన్నతా అధికారులకు సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా చేయడం విశేషం. ఒక్క విద్యుత్ పోల్ కావాలంటే దానికి ఖచ్చితంగా ఎస్టిమేషన్ వేసి సంబంధిత డిడిలు కట్టిన వారికి పోల్ వేయాలన్న, ట్రాన్స్ ఫార్మర్ లు బిగించాలి అన్న చుక్కలు చూపుతారు విద్యుత్ శాఖ అధికారులు. ఇప్పటికి 2016-17 సంవత్సరానికి సంబంధించిన డిడిలు చెల్లించిన వారికి కరెంట్ కనెక్షన్ లు లేవు, ట్రాన్స్ పార్మర్ లు ఇవ్వని చరిత్ర సంబధిత అధికారిదే. ట్రాన్స్ ఫార్మర్ ను అధికారి కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా మార్చడం వివాదాస్పదమైంది. ఈవిషయంలో స్థానిక లైన్ ఇన్స్ పెక్టర్ ను బూతులు తీట్టడంతో ఈ వ్యవహరం చిలికి చిలికి గాలి వానాల మారింది.

సాధారణంగా విద్యుత్ శాఖలో అధికారులకు తెలియకుండా ఎలాంటి పనులు చేపట్టరు. ముఖ్యంగా అధికారులు సిబ్బంది కలిసి సమన్వయంతో పనిచేస్తారు. కాని మోస్రా చందూర్ అధికారి, సిబ్బంది మద్య సమన్వయం లేదు. సంబందధిత సెక్షన్ పరధిలో ప్రతి పనికి కాసులు అడుగుతుండటంతో తాము కస్టమర్ల దగ్గర వసూలు చెయ్యం, ఎవ్వరికి ఏమీ ఇవ్వం అని తెగేసి చెప్పడంతో కొందరిపై అధికారి కక్ష కట్టినట్లు తెలిసింది. ఇక్కడ ఒక్కరిద్ధరు ప్రస్తుత అధికారితో పనిచేసిన సాన్నిహిత్యంతో మిలాఖత్ అయినట్లు తెలిసింది. మిగిలిన వారు అధికారి తీరును మొదటినుంచి వ్యతిరేకిస్తున్నవారు ఉన్నారు. దానితో అక్కడ నిత్యం వివాదాలు వెలుగు లోకి వస్తున్నాయి. తాజాగా ఏకంగా ఎలాంటి ఎస్టిమేషన్ లు లేకుండానే ఫీడర్ చేంజ్ వ్యవహరంపై పెద్ద ఎత్తున కాసులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ శాఖా అదాయానికి గండి కొడుతు అధికారుల అనుమతులు లేకుండానే జరిగిన వ్యవహరం పై ఉన్నలైన్ ఇన్స్ పెక్టర్ పై అధికారి చిందులు వేయడం, బూతులు తీట్టిన వ్యవహరంపై అధికారులు చర్యలు తీసుకోకుండా సద్దమనిగేలా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నిజామాబాద్ లోని ఎంఆర్ టిలో జరిగిన అవినీతిపై ఆకాశ రామన్న ఉత్తరాల ద్వార సీయండికి ఫిర్యాదు చేశారు కొందరు. ఇప్పుడు అదే బాటలో సంబంధిత ఏరియా కింది స్థాయి అధికారులు సిబ్బంది పూర్తి స్థాయి సమాచారంతో ఫిర్యాదుకు సిద్ధమౌతున్నట్లు తెలిసింది.

