23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యా బోధన చేయండి

Must read

📰 Generate e-Paper Clip

నోడల్ అధికారి రమణారావు
బతుకమ్మ పిట్లం : విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యా బోధన చేయాలని నోడల్ అధికారి రమణారావు సూచించారు. పిట్లం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్న కొడపగల్ లో జరిగిన ప్రాథమికోన్నతస్థాయి కాంప్లెక్స్ లో గురువారం నిర్వహించిన సమావేశానికి మండల విద్యాశాఖ అధికారి దేవి సింగ్ ,మండల నోడల్ అధికారి రమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ విద్యార్థులకు అభ్యసన సామర్ధ్యాలు  అభివృద్ధి చెందేలా బోధన కొనసాగించాలని ఎన్ఏఎస్ పరీక్షకు సన్నద్ధం చేయాలని సూచించారు. నోడల్ అధికారి రమణారావు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి విషయాన్ని పై అవగాహన కలిగించి బోధన చేయాలని తెలిపారు. అనంతరం ఎజెండా ప్రకారం మీటింగ్ కొనసాగించాలని సూచించారు. ఆర్పీలు ఎజెండా ప్రకారం మాదిరి పాఠ్యాంశం అంశాలపై చర్చించామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధ, వివిధ పాఠశాలల తెలుగు భాష ఉపాధ్యాయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ హైమద్ పాషా పాల్గొన్నారు.

More articles

Latest article