27.1 C
Hyderabad
Sunday, August 2, 2026

కోరిన కోరికలు తీర్చే నవ దుర్గమ్మ

Must read

📰 Generate e-Paper Clip

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నవ దుర్గాదేవి ఎంతో మహిమగల అమ్మవారు అని… కోరిన కోరికలు తీరుస్తూ, పాత కలెక్టరేట్ లో ఈ ఆలయం ఉండటంతో పండగ వాతావరణం ఉండేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని పాత కలెక్టరేట్ లో ఆనవాయితీగా నిర్వహించే బోనాల ఉత్సవాలను నవదుర్గ దేవీ ఆలయ కమిటీ చైర్మన్, టిజీఓ అద్యక్షులు అలుక కిషన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర టిజీఓ అద్యక్షులు ఏలూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్యనారయణ హాజరై బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ లో సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బోనాల పండుగ అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ధైర్యాన్ని అందిస్తూ ఒకప్పుడు చిన్నగా ఉండే అమ్మవారి ఆలయం ఆలయ కమిటీ నిర్వాహకుల కృషితో ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు.  ఈ కార్యక్రమంలో టిజీఓ అద్యక్షులు, ఆలయ కమిటీ చైర్మన్ అలుక కిషన్, ప్రధాన కార్యదర్శి అమృత్ కుమార్, కోశాధికారి ఉమా కిరణ్, ఉపాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, సలహాదారులు ఆకుల ప్రసాద్,  సభ్యులు నెతుకుంట దాస్, జయింట్ సెక్రటరీ  గంధం వెంకటేశ్వర్లు, మహిళ ఉద్యోగులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Nava Durga, who fulfills wishes

More articles

Latest article