27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని కోట గల్లి స్మశాన వాటిక వద్ద యువకుడు అనుమానాస్పస్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. గుర్తు తెలియని 25 సంవత్సరాల  యువకుడు  మత్తులో బోర్ల పడి మృతి చెంది ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో పడి చనిపోయాడా లేక కల్లు మత్తు కారణంగా పడి చనిపోయాడని విషయాలు తెలియ రాలేదు. యువకుడి ఆచూకీ తెలిస్తే గాని విషయం బహిర్గతమయ్యే అవకాశం లేదని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని నాలుగవ టౌన్ ఎస్సై శ్రీకాంత్ సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.

More articles

Latest article