28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కరెన్సీ నోట్లపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కరెన్సీ నోట్లపైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని పోస్ట్ కార్డు ఉద్యమానికి టీఎమ్మార్పీఎస్ నాయకులు మల్లని శివ మాదిగ మద్దతు తెలిపారు. కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జరిపోతుల పరుశురాం నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశారు. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుగా ఇచ్చారు.  టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా పర్యటన భాగంగా పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతుగా నిలుస్తూ జిల్లా కోర్ట్ చౌరస్తాలో  పోస్ట్ కార్డు ఉద్యమం పోస్ట్ కార్డులను రాశారు. అంబేద్కర్ వల్లే ఆర్భీఐ ఏర్పడి ఇప్పటికి 90 సంవత్సరాలు అయినా ఫోటోను ముద్రించకపోవడం అంటే చరితను వక్రీకరించడమేనన్నారు. ఇప్పటికైనా మీరు చొరవ తీసుకొని కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు బండారిపల్లి మల్లేష్, నాయకులు ప్రకాష్, అశోక్ అడ్వకేట్ పులి జైపాల్, అడ్వకేట్ ఎండలు ప్రదీప్, దళిత సంఘ నాయకులు బంగారు సాయిలు, సఖి విజయ్ పాల్గొన్నారు.

Dr. B.R. Ambedkar's photo should be printed on currency notes

More articles

Latest article