హైదరాబాద్, బతుకమ్మ : తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు చేశారు. చైర్ పర్సన్ నేరెళ్ల శారద అందుబాటులో లేకపోవడంతో మహిళా కమిషన్ సభ్యులు సుదం లక్ష్మీ, రేవతి రావు, ఉమ, అప్రోజ్ సహీనాకు తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు లేఖ అందజేశారు. చైర్ పర్సన్ అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదు లేఖను తాను తీసుకోనని, సభ్యులకే ఇవ్వాలని సూచించి మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజా రమణ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మల్లన్న తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోగా అంతకన్నా తీవ్ర స్థాయిలో ఎమ్మెల్సీ కవితను దూషించిన విషయాన్ని మహిళా కమిషన్ కు జాగృతి నాయకులు వివరించారు.
- తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట తెలంగాణ జాగృతి మహిళా నాయకుల ఆందోళన..
తమ ఫిర్యాదు తీసుకునేందుకు చైర్ పర్సన్ అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట తెలంగాణ జాగృతి మహిళా నాయకుల ఆందోళన నిరసన తెలిపారు. తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎల్ బీ నగర్ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద తెలంగాణ జాగృతి, వివిధ కుల సంఘాల నాయకులు నిరసన తెలిపారు. తీన్మార్ మల్లన్నపై ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

