30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రముఖ నటి సరోజాదేవి కన్నుమూత

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : సీనియర్ నటి, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజా దేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో సరోజాదేవి వరుస విజయాలను సాధించారు . 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 1942లో కర్నాటకలో జన్మించిన సరోజాదేవి 13 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1955 నుంచి 1984 మధ్య 29 ఏళ్ల పాటు వరుసగా 161 సినిమాల్లో లీడ్ రోల్ లో నటించిన ఏకైక నటిగా సరోజాదేవి చరిత్ర  సృష్టించారు. సరోజా దేవి మరణంపై పలువురు సంతాపం తెలిపారు.

More articles

Latest article