26.3 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యుత్ వైర్లు తెగిపడి మేకలు మృతి

Must read

📰 Generate e-Paper Clip

గాంధారి, బతుకమ్మ :  గాంధారి మండల కేంద్రంలోని దుర్గ నగర్ కాలనీలో విద్యుత్ వైర్లు తెగిపడి ఆదివారం సాయంత్రం మూడు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. వెంటనే స్థానికులు లైన్మెన్ కు ఫోన్ చేయగా విద్యుత్ సరఫరా నిలిపివేసి తెగిపోయిన విద్యుత్ తీగలను మరమ్మత్తులు చేస్తున్నారు. మూడు మేకల మృతి చెందడంతో యజమాని దోల్లు రమేష్ మేకల కాపరిగా కులవృత్తిగా నిర్వహిస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. ఈ తరుణంలో మూడు మేకలు విద్యుత్ తీగలు పడి చనిపోగా సుమారు 50 నుంచి 60 వేల రూపాయల నష్టం జరిగిందని యజమాని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి తనకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాడు.

More articles

Latest article