28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అడ్లూరి లక్ష్మణ్ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

  • మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్

 

కామారెడ్డి,బతుకమ్మ : అడ్లూరి లక్ష్మణ్ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు దివ్యంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ఆత్మీయ సన్మాన సభ జూలై 26 బుధవారం 11 గంటలకు హైదరాబాదులోని సుప్రభాత్ హోటల్, హబ్సిగూడ జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మాదిగలకు స్థానం కల్పించడంతోపాటు , నలుగురు దళిత ప్రతినిధులను మంత్రుల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి మా జాతి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నమన్నారు.ఈ ఆత్మీయ సన్మన సభకు మాదిగ ప్రజా ప్రతినిధులు, దళిత బహుజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రం, జిల్లా నాయకులు స్వామి, చందు, భూపతి, బట్టు స్వామి, శ్రీకాంత్, దేవేందర్ పాల్గొన్నారు.

Make the Adluri Laxman Atmiya Sammana Sabha a success

More articles

Latest article