30.9 C
Hyderabad
Monday, August 3, 2026

స్థానిక ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు 25శాతం టిక్కెట్లు

Must read

📰 Generate e-Paper Clip

  • యూత్ కాంగ్రెస్ రాష్ట్ర  అధ్యక్షులు శివచరణ్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జిల్లా అధ్యక్షులు తాళ్ళ విపుల్ గౌడ ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ర్ట అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి గారు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ పెంపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ  సందర్భం గా శివ చరణ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.  అనంతరం మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అదే విధంగా రానున్న స్థానిక ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు 25శాతం టిక్కెట్లు ఇప్పించే విధంగా కృషి చేస్తానని అన్నారు. అలాగే ఐవైసి ఆప్ గురించి వివరించడం జరిగింది. రానున్న స్థానిక ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయం కొరకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు,జిల్లా కార్యవర్గ సభ్యులు,వివిధ అసెంబ్లీ అధ్యక్షులు,మండల అధ్యక్షులు జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

25 percent tickets for Youth Congress in local elections

More articles

Latest article