నాగిరెడ్డిపేట్, బతుకమ్మ : నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామానికి చెందిన బొర్రోళ్ళ సతీష్ ఆకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. సతీష్ తాపీ మేస్త్రి గా పనిచేస్తుందేవాడు. శుక్రవారం రోజులాగానే ఎల్లారెడ్డి పట్టణంలో మేస్త్రి పని చేస్తుండగా ఒక్కసారి గుండెలో నొప్పి వస్తుందని పక్కనే కూర్చుని కుప్పకులాడని సంఘటన స్థలంలో ఉన్న తోటి కూలీలు తెలిపారు. తోటి కూలీలు వెంటనే ఎల్లారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మార్గమధ్యలో మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
