26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ఆర్డినెన్స్ ను గవర్నర్  ఆమోదించకుండా ఆపితే  రైల్వే రో కో తప్పదు 

Must read

📰 Generate e-Paper Clip

బీసీలకు  42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి నిరంతర పోరాటం

ప్రభుత్వానికి వారం గడువు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, బతుకమ్మ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం బీసీ బిడ్డలు, తెలంగాణ జాగృతి, యూనైటైడ్ ఫూలే ఫ్రంట  విజయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్డినెన్స్ తెస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఈనెల 17వ తేదీన తాము నిర్వహించ తలపెట్టిన రైలు రోకోను నిరవధిక వాయిదా వేస్తున్న చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో తన నివాసంలో శుక్రవారం కవిత మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకువచ్చే ఆర్డినెన్స్ ను  ఆమోదించకుండా గవర్నర్ ఆపితే మళ్లీ రైల్వే రో కో తప్పద అని హెచ్చరించారు. బీజేపేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నమెంట్ కు గవర్నర్లకు మధ్య పంచాయతీలు నడుస్తున్నాయన్నారు. తెలంగాణలో అదే పరిస్థితి వస్తే తమకు ఉద్యమాలు కొత్త కాదని మళ్లీ ఉద్యమాలు చేస్తామని, రైలు, బస్సులను స్తంభింప చేస్తామన్నారు.  బీసీలకు  42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. డిల్లీకి వెళ్లి బీజేపీ, కాంగ్రెస్  మోసాన్నీ ఎండగట్టామన్నారు.   కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకొని బీసీ బిల్లును 9 వ షెడ్యూల్ లో పెట్టించి రాజ్యాంగ సవరణ చేయించేలా కేంద్రాన్ని ఇప్పించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు అవుతాయన్నారు.  రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. వారం రోజుల పాటు ప్రభుత్వాన్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటామన్నారు. ప్రభుత్వం కేవియట్ పిటిషన్ వేసి ఆర్డినెన్సు పై ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందా లేదా అనేది వారంలో తెలిసిపోతుందన్నారు. అనంతరం ముందు  లోయర్ ట్యాంక్ బండ్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మింట్ కాంపొండ్ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాలకు పూల మాలలు వేసేందుకు బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి కవిత బయల్దేరి వెళ్లారు.

More articles

Latest article