బతుకమ్మ, భిక్కనూరు: ఉరి వేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన భిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కందూరి లింగం (55) రైతు మందుకు బానిసై ఆయన భార్య పిల్లలతో గొడవ పడ్డాడు. ఉదయం కందూరి లింగం కొడుకు ఇంటి వెనకాల చూడగా ఇంటి స్లాబ్ సలాకాకు నైలాన్ తాడుతో ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
