26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బూత్ లెవెల్ అధికారులే కీలకం

Must read

📰 Generate e-Paper Clip

  • స్థానిక సంస్థల అధికారి బి.చందర్

 

మద్నూర్, బతుకమ్మ: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా బూత్ లెవల్ అధికారులకు నిర్వహిస్తున్న ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు గురువారం మద్నూర్, డోంగ్లి మండలాల బూతు లెవల్ అధికారులకు ఎన్నికల నిర్వహణలో వారి పాత్ర,  ఓటరు జాబితా రూపకల్పన లో వారి పాత్ర , ఇంటింటి సర్వే, ఫారం 6, 7, 8 లను ఏ విధంగా  చేయాలి, దాంట్లో వస్తున్నటువంటి సమస్యలు , పరిష్కారాలపై టీవీ ద్వారా బీఎల్ఓ లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి చందర్ స్థానిక సంస్థల అధికారి హాజరై వారు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన బీఎల్ఓ అధికారులే కీలకం అన్నారు. భారత ఎన్నికల సంగ్రామంలో ఓటర్ జాబితా తయారీలో బీఎల్ఓ లే కీలకం అన్నారు. బీఎల్ఓ లేనిదే ఎన్నికలు, ఎన్నికల సంఘం లేదు అలాంటి గొప్ప పాత్ర బీఎల్ఓ లది కావున ఓటర్ జాబితా ను తప్పుడు లేకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, నాయబ్ తహసిల్దార్ శివరామకృష్ణ, గిర్దవార్ల శంకర్, సాయిబాబా రెవిన్యూ అధికారులు రవి, బాలరాజు, దశరథ్, ప్రవీణ్ మరియు రెండు మండలాల బీఎల్ఓ లు పాల్గొన్నారు.

Booth level officials are the key

More articles

Latest article