- తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహ రెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలోని బార్ కౌన్సిల్ కార్యాలయంలో బార్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు సునీల్ గౌడ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి లతో కలిసి పలు విధానపరమైన విషయాలు తెలిపారు.న్యాయవాదులు న్యాయవాద వృత్తికి పదవి విరమణ చేసిన లేదా డెత్ క్లయిమ్ ఆరు లక్షల నుండి పది లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నవారికి వైద్య ఖర్చులకుగాను లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని వెల్లడించారు.జూనియర్ న్యాయవాదులు వారి న్యాయవాద వృత్తిని మెరుగు పరుచుకోవడానికి లైబ్రరీ ఖర్చుల రుణాన్ని పది వేల నుండి పదిహేను వేలకు పెంచినట్లు తెలిపారు.ఒకవేళ ఎవరైనా న్యాయవాది మరణించినట్లు అయితే వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియలనిమిత్తం ఇరవై వేలు తక్షణమే అందిస్తామని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల అభీష్టం మేరకు పై విధాన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ, బార్ కౌన్సిల్ న్యాయవాదుల సంక్షేమ నిధులు రెండిటిని బేరీజు వేసుకుని పై నిర్ణయాలు బార్ కౌన్సిల్ సభ్యుల ఆమోదం మేరకు తీసున్నావని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు బార్ కౌన్సిల్ నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఒక చట్టభద్ధమైన వ్యవస్థ అని ఆ చట్రం కింద న్యాయవాదుల సంక్షేమానికి, ఆర్థిక పురోగతికి, ప్రగతికి బలమైన పునాదులు వేశాయని వారు తెలియజేశారు.
