25.3 C
Hyderabad

కల్తీ కల్లు ఘటనలో ముగ్గురి మృతి

Must read

📰 Generate e-Paper Clip

నిమ్స్ లో బాధితులను పరామర్శించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్, బతుకమ్మ: హైదరాబాద్​లో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కూకట్​పల్లి పరిధిలోని హైదర్​నగర్​లో మంగళవారం కల్తీ కల్లు తాగి 14 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వారిని స్థానికులు రాందేవ్​ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తులసిరామ్‌ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65) మృతి చెందారు. మృతులంతా హెచ్‌ఎంటీ హిల్స్‌ సాయిచరణ్‌కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. మరికొంత మంది కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు  పరామర్శించారు.

More articles

Latest article