నిమ్స్ లో బాధితులను పరామర్శించిన మంత్రి జూపల్లి
హైదరాబాద్, బతుకమ్మ: హైదరాబాద్లో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కూకట్పల్లి పరిధిలోని హైదర్నగర్లో మంగళవారం కల్తీ కల్లు తాగి 14 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వారిని స్థానికులు రాందేవ్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తులసిరామ్ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65) మృతి చెందారు. మృతులంతా హెచ్‌ఎంటీ హిల్స్ సాయిచరణ్‌కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. మరికొంత మంది కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు.