కల్తీ కల్లు ఘటనలో ముగ్గురి మృతి

నిమ్స్ లో బాధితులను పరామర్శించిన మంత్రి జూపల్లి హైదరాబాద్, బతుకమ్మ: హైదరాబాద్​లో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కూకట్​పల్లి పరిధిలోని హైదర్​నగర్​లో మంగళవారం కల్తీ కల్లు తాగి 14 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వారిని స్థానికులు రాందేవ్​ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తులసిరామ్‌ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65) మృతి చెందారు. మృతులంతా హెచ్‌ఎంటీ హిల్స్‌ సాయిచరణ్‌కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. మరికొంత మంది కల్తీ కల్లు...