26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ:వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కీలకం అయినటువంటి ప్రత్యేక రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యకు సంబంధించిన నమోదు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల వ్యవసాయ  ఆదికారి హరీష్ కుమార్ మాట్లాడుతూ భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఈ ప్రత్యేక రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖకు అందించాలని ఈ క్రమంలో తమ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు నెంబరు ఆధార్ కార్డుకు జత చేసినటువంటి మొబైల్ ఫోన్ నెంబరు అందజేయాల్సి ఉంటుంది ఈ మొబైల్ నెంబర్ కు మూడు ఓటిపిలు రావడం జరుగుతుంది ఈ వివరాలను వ్యవసాయ విస్తీర్ణాధికారికి అందించినట్లయితే 11 అంకెలతో కూడినటువంటి రైతు విశిష్ట సంఖ్య అందజేయబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  రైతుల కోసం చేపట్టేటువంటి వివిధ సంక్షేమ పథకాల్లో అమలులో పారదర్శకంగా ఉండడానికి ఈ విశిష్ట సంఖ్య ఎంతో కీలకం కానుంది కావున రైతులు తప్పనిసరిగా ఈ రైతు విశిష్ట సంఖ్యను పొందడానికి పైన పేర్కొన్నటువంటి వివరాలు వ్యవసాయ శాఖ అధికారులకు అందజేయాలని తెలిపారు ఈ విశిష్ట సంఖ్య కేవలం కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ పథకాలకు  మాత్రమే ఉపయోగపడుతుంది ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మన్ నిధి, ఫసల్ బీమా యోజన రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన వంటి పథకాల అమలులో ఈ విశిష్ట సంఖ్య తప్పనిసరిగా అవసరం ముఖ్యంగా వచ్చే 20  విడత  పీఎం కిసాన్ సమ్మన్ నిధి నిధులు విడుదల కావాలంటే ఈ 11 సంఖ్యల రైతు విశిష్ట సంఖ్య తప్పనిసరి. మండలంలోని మొత్తం రైతులు 8536 ఇప్పటి వరకు నమోదు చేసుకున్న రైతులు 4257 మిగిలిన రైతులు కూడా తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ ఆదికారి హరీష్ కుమార్ వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శ్రీలత, లక్ పతి రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article