- నిజామాబాద్ జిల్లా ఎస్ఈ రాపల్లి రవీందర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా రెంజల్ మండలం విద్యుత్ ఉప కేంద్రంలో మూడు కొత్త విసిబిలు చార్జి చేయడం జరిగిందని నిజాంబాద్ జిల్లా ఎస్ఈ రాపల్లి రవీందర్ తెలిపారు. సాఠాపూర్ టౌన్ లీడర్, న్యూ బాగపల్లి, ధూపల్లి మూడు ఫీడర్లకు విసిబిలు అమర్చడం జరిగిందని తెలిపారు. మూడు విసిబిలు బిగించడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం నియంత్రించబడుతుందన్నారు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో నిజాంబాద్ జిల్లాలో 108 బ్రేకర్లు అమర్చడం జరిగిందని తెలిపారు. రెంజల్ లో కూడా కొత్తగా మూడు బ్రేకర్స్ ప్రారంభించడం జరిగిందన్నారు. దీంతో ఏ ఫీడర్లో ప్రాబ్లం వస్తే అదే ఫీడర్లో వినియోగదారులకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి ముక్తార్, డిఈ బోధన్ డి.వెంకటరమణ, డిఈ కన్స్ట్రక్షన్ ఎమ్మార్టీ నిజాంబాద్ తోట రాజశేఖర్, ఎడి ఈ కన్స్ట్రక్షన్ నిజాంబాద్ మగ్దూం అలీ, ఏఈ ఆపరేషన్ రెంజల్ ఆర్.సుమిత, ఏఈ కన్స్ట్రక్షన్ బోధన్, సబ్ ఇంజనీర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
