26.2 C
Hyderabad
Monday, August 3, 2026

సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర  ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై సోమవారం పోలీస్ కళాబృందం చే అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ డ్రంక్ అండ్ డ్రైవ్ మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ సేవించి యువత పెడదారి పట్టొద్దని మహిళలు చిన్నపిల్లలపై జరుగుతున్న హత్య నేరాలు బాల్యవివాహాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియాలతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. సైబర్ నేరాల టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ వి శ్రీనివాస్ రఘువీర్ సింగ్ పోలీసులు విద్యార్థులు ఉన్నారు.

Awareness on cybercrimes and road accidents

More articles

Latest article